Monday, May 3, 2010

నాకు తెలిసిన కొన్ని నిజాలు!

కొన్ని విషయాలు మనకు తెలిసినట్టే వుంటాయి. కాని సంపూర్ణంగా తెలియదు. తెలిసినప్పుడు అవునా అని ఆశ్చర్యం కలగకా మానదు. నాకు తెలిసిన అలాంటి కొన్ని నిజాలు ఇవి. బహుశా మీకు కూడా తెలిసే వుంటాయి. అయినా ఒకసారి చూడండి.

* మనది ఎడమ చేతి రాత అయితే మనం ఆహారాన్ని ఎడమ వైపునే నములుతాం. అదే కుడి చేతి రాత అయితే కుడి పక్కన నములుతాం.

*  ఉల్లిపాయలు కోసేటప్పుడు చూయింగ్ గమ్ నములుతూ వుంటే కళ్ళు మండవు.

* పొగ తాగేవారికి మామూలు వ్యక్తులతో పోలిస్తే ఒక గంట ఎక్కువ నిద్ర అవసరం.

* నవ్వు అరోగ్యానికి చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించి, కండరాలను అరోగ్యంగా వుంచటంలో నవ్వు ప్రముఖ పాత్ర వహిస్తుందని వైద్యులు ధ్రువీకరించారు. అయితే పెద్దవారితో పొలిస్తే చిన్న పిల్లలే ఎక్కువగా నవ్వుతారట! ఆరేళ్ళ బిడ్డ రోజుకు దాదాపు 300 సార్లు నవ్వితే, పెద్దవాళ్ళు కేవలం 15 నుంచి 100 సార్లు మాత్రమే నవ్వుతారట!

* కుక్కల్లో డాల్మేషన్స్ ని చాలామంది ఇష్టపడతారు. అయితే వాటి ఒంటి మీద వుండే నల్లని చుక్కలు పుట్టుకతో రావని చాలామందికి తెలియదు.

* మగవాళ్ళ చొక్కాలకు కుడి వైపున, ఆడవాళ్ళ చొక్కాలకు ఎడమ వైపున గుండీలు వుంటాయని ఎప్పుడైనా గమనించారా?

* మనం తుమ్మే ప్రతిసారీ మన మెదడులోని కొన్ని నాడులు చనిపోతాయట

* కోళ్ళు తమ మెడను సాగదీయకుండా కూయలేవు.

* ఖడ్గమ్రుగం తెలుసుగా? అది దిగులుగా వున్నపుడు దాని చెమట ఎర్రగా మారిపోతుంది.

* టైటానిక్ షిప్ మళ్ళీ నిర్మించాలంటే 7 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. కాని టైటానిక్ సినిమా తీయాలంటే మాత్రం 200 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయట!

* ఈఫిల్ టవర్ పై అంతస్తుకి చేరుకోటానికి 1,792 మెట్లు ఎక్కాలట!

* మన శరీరంలో రక్త సరఫరా వుండని ఏకైక అవయవం కార్నియా. అది ఆక్సిజన్ ని డైరెక్ట్ గా గాలి నుంచి తీసుకుంటుంది.

* తలను వెనక్కి తిప్పకుండా వెనుక ఏం జరుగుతుందో చూడగల జంతువులు రెండే రెండు. ఒకటి కుందేలు, రెండోది రామచిలుక.

* బొద్దింక తలను కట్ చెసినా అది కొన్ని వారాల వరకూ బతికే వుంటుంది.

* ఫిబ్రవరి 1865... ఈ నెలకి చరిత్రలో ఒక ప్రాధాన్యత వుంది. అదేమిటంటే, అసలు పౌర్ణమి అంటూ లేని నెల అది. ఆ నెలలో అసలు పూర్ణ చంద్రుడు కనిపించలేదంట!

ఇప్పటికి ఇవి చాల్లెండి. మరోసారి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

3 comments:

  1. మనది ఎడమ చేతి రాత అయితే మనం ఆహారాన్ని ఎడమ వైపునే నములుతాం. అదే కుడి చేతి రాత అయితే కుడి పక్కన నములుతాం.

    Naadi kudichethi vraatha. Kaanee Nenu edama vaipe navuluthaa.

    Any way good collection

    ReplyDelete
  2. బహుశా ఎక్కువ శాతం అలా జరుగుతుందేమో గీతగారూ! నేను కూడా ఎక్కడో చదివిందే కదా! any way thank u so much.

    ReplyDelete
  3. nice collection, fib-1865 lanti month e 146 years lo ippativaraku marosari raleda?

    ReplyDelete