సాక్షి ఫ్యామిలీలో జిందగీ కాలమ్ కోసం రాసిన ఆర్టికల్.
ఇది నా ప్రపంచం. నా కలలు-కోరికలు, నా ఆశలు-ఆశయాలు, నా కలతలు-కన్నీళ్లు, నా భావాలు-భావోద్వేగాలు... అన్నీ ఇక్కడ అక్షరాలుగా చల్లుతాను. ఇక్కడ నేను వుంటాను. నేను మాత్రమే వుంటాను.
Saturday, October 2, 2010
Wednesday, September 29, 2010
నా లిస్టులో చేరిన మరో మంచి సినిమా!
దాసరి నారాయణరావు... నా నా అభిమాన దర్శకుడు అని చెప్పేస్తే సరిపోదు. ఎందుకంటే నాలాంటి అభిమానులు వందల్లో, వేళల్లో వుంటారు. అద్భుతమైన సినిమాలను సృష్టించిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. బలిపీఠం, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, మేఘసందేశం, ప్రేమాభిషేకం, శివరంజని... ఒకటా రెండా.. చెప్పుకుంటూ పోతే లెక్క తెగనన్ని చిత్ర రాజాలు మన కళ్ళముందు ఠీవిగా వచ్చి నిలబడతాయి. అలాంటి ఒక చిత్రాన్ని ఈరోజు ఉదయం తేజ టీవిలో చూసాను. అదే ధర్మపీఠం దద్దరిల్లింది. శోభన్ బాబు, జయసుధ, కైకాల సత్యనారాయణ తదితరులు నటించిన ఈ చిత్రం.. దర్శకరత్నమన తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన మరో మంచి చిత్రం.
మామూలుగానే శోభన్ బాబు అంటే పడి చచ్చే నేను, ఈ సినిమాలో ఆయన నటన చూసి రెప్ప వేయటం కూడా మర్చిపోయాను. ఆ ఠీవి, ఆ నడక, ఆ డైలాగ్ డెలివరీ... ఓహ్.. ఆ పాత్రలో ఆయన జీవించారు. తన బిడ్డలను దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలనే వున్నతమైన ఆలోచనతో ఒకడిని డాక్టర్ని, ఒకడిని ఇంజినీర్ని, ఒకడిని లాయర్ని చేస్తాడు తండ్రి. కానీ వాళ్ళు అవినీతికి కొమ్ము కాసేవాళ్ళుగా, లంచాలకు న్యాయాన్ని తాకట్టు పెట్టేవాల్లుగా తయారవుతారు. ఒక కొడుకు చేసిన దుర్మార్గాన్ని చూసిన తల్లి దానిని బయటపెట్టబోతున్న తల్లిని, ముగ్గురు కొడుకులూ కలిసి పిచ్చిదానిలా చిత్రీకరిస్తారు. ఒక సమయంలో భర్తకు నిజం చెప్పి కన్ను మూస్తుంది ఆమె. సాయం చేయమని వచ్చిన తన స్నేహితునికి సైతం డబ్బుకు ఆశపడి తన కొడుకులు అన్యాయం చేయడాన్ని జీర్నిన్చుకోలేకపోతాడు తండ్రి. వాళ్ళు బతికుంటే సమాజాన్ని నాశనం చేస్తారన్న ఉద్దేశంతో తన ముగ్గురు కొడుకుల్నీ చంపేస్తాడు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్షను విధించగానే, కోర్టులోనే కుప్పకూలిపోతాడు.
కధ ఆసాంతం ఆసక్తికరంగా సాగుతుంది. అందరూ ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేసారు. అయితే శోభన్ నటన మాత్రం అద్వితీయం. ముఖ్యంగా క్లైమాక్స్‌లోని కోర్టు సీన్లో ఆయన హావభావాలు, డైలాగ్స్ చెప్పేటప్పుడు ఖంగుమనే స్వరం అమేజింగ్. శోభన్ బాబు సినిమా కదా అని చూడటం మొదలుపెట్టాను కానీ, ఆ కధ, కధన శైలి నన్ను కదలనివ్వలేదు. హాట్సాఫ్ టు దాసరి అండ్ శోభన్ బాబు!
న్యాయం గెలిచిందా ఓడిందా?
సుదీర్ఘ విచారణలు, వివాదాల తరువాత ఆయేషా మీరా హత్య కేసులో తీర్పు వెలువడింది. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడింది. అయితే శిక్ష పడింది నేరం చేసినవాడికేనా? చేసాడని అనుకుంటున్న వాడికా?
ఎందుకో తెలియదు కాని, ఈ తీర్పు నాకు సంతృప్తిని కలిగించలేదు. సత్యం అసలు నేరస్తుడు కాదని అందరిలాగే నేనూ నమ్మటం వల్లనా లేక ఒక అమాయక ఆడపిల్లను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న క్రూరునికి ఆ శిక్ష సరిపోదనా? ఏమో... ఏమీ తెలియటం లేదు. ఒకటి మాత్రం అనిపిస్తోంది. ఈ సమాజంలో ఆడపిల్లకు ఇప్పటికీ రక్షణ కరువే... పేదవాడికి ఎప్పటికి న్యాయం కరువే.
ఆ రోజు ఉదయం పేపర్లో ఆయేషా హత్య గురించి చదివి నేను కదలిపోయాను. మనుషుల్లో ఇంత పైశాచికత్వం, ఇంత రాక్షసత్వం ఉంటాయా అని హడాలిపోయాను. అభం శుభం తెలియని ఒక ఆడపిల్లని ఇంత క్రూరంగా చంపిన మానవ మృగాన్ని ఏమి చేసినా పాపం లేదని అనుకున్నాను. కాని నేను కోరుకున్నట్టు వాడిని ఎవరూ ఏమీ చేయలేదు. ఒక పసిమొగ్గ రాలిపోయింది. ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఒక కన్నతల్లి కన్నీరు ఏరయ్యింది. ఆమెకు ఎవరూ ఓదార్పు కలిగించలేదు. న్యాయం చేయలేదు. సాక్ష్యాలు తారుమారయ్యాయి. వాస్తవాలు మారిపోయాయి.
ఆయేషా హత్య జరిగిన రోజు ఆమె ఉంటున్న హాస్టల్ ఎదురుగా ఉన్న టీ కొట్టులో టీ తాగుతూ, హాస్టల్ వద్దనే సత్యంబాబు తచ్చాడటం ఒక వ్యక్తి చూశాడు. అంతకుమించిన ప్రత్యక్ష ఆధారాలు లేవు. అయినా అతన్ని అరెస్ట్ చేసారు. రకరకాలుగా విచారణ చేసారు. అతను నేరాన్ని అంగీకరించాడు. ఇప్పుడు శిక్షకీ తల వంచాడు. కానీ అతడు నేరస్తుడు కాదని, అసలు నేరస్తులు వేరే వున్నారని ఆయేషా తల్లి బల్ల గుద్ది చెప్పారు. మరి ఆ మాటలను ఎవరూ ఎందుకు పట్టించుకోలేదో, కనీసం హాస్టల్ వార్డెన్ని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ అర్ధం కాని, సమాధానం దొరకని ప్రశ్నలే. అయితే ఈ ప్రశ్నలు తీర్పు ఇచ్చే జడ్గి మనసులో రేకేత్తకపోతయా, వాళ్ళని కూడా హాజరుపరచమని ఆదేశాలు ఇవ్వకపోతాడా అని చివరి క్షణం వరకూ ఆశగా చూసాను. కాని నేనూ అనుకున్నది జరగలేదు. అనుమానాలు నివృత్తి కానేలేదు. కేసు మాత్రం పూర్తయింది. న్యాయమే గెలిచిందో అన్యాయమో గెలిచిందో తెలియదు కానీ ఆయేషా హత్యోదంతానికి శాశ్వతంగా తెర పడింది.ఎందుకో తెలియదు కాని, ఈ తీర్పు నాకు సంతృప్తిని కలిగించలేదు. సత్యం అసలు నేరస్తుడు కాదని అందరిలాగే నేనూ నమ్మటం వల్లనా లేక ఒక అమాయక ఆడపిల్లను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న క్రూరునికి ఆ శిక్ష సరిపోదనా? ఏమో... ఏమీ తెలియటం లేదు. ఒకటి మాత్రం అనిపిస్తోంది. ఈ సమాజంలో ఆడపిల్లకు ఇప్పటికీ రక్షణ కరువే... పేదవాడికి ఎప్పటికి న్యాయం కరువే.
Friday, August 20, 2010
చిన్నవాళ్ళ పెద్ద మనసు
దేనికోసమో ఇంటర్నెట్ ను తవ్వుతుంటే ఈ అద్భుత దృశ్యం కంటబడింది. మనిషికి మనిషి చేయగలిగిన సాయం చేయడానికి కూడా ముందుకు రాని ఈ రోజుల్లో, ఆడుతూ పాడుతూ తిరిగే ఈ పసివాళ్ళు ఒక మూగ ప్రాణిని కాపాడటం కోసం పడిన తపన నన్ను కదిలించింది. స్వార్ధంతో మన సుఖం మన సంతోషం తప్ప, సాటి మనిషి గురించి కనీసం పట్టించుకోని మనకు పిల్లలు నేర్పుతున్న పాఠం ఇది!
Friday, August 13, 2010
నీవు మరపు'రావు'
నేడు రావు గోపాలరావు వర్ధంతి.
ఆహార్యం, వాచకం, అభినయం... అన్నింట్లోనూ ఆయనది ఒక ప్రత్యేక శైలి. ఆయన కామెడీ చేస్తే నవ్వలేక పొట్టలు పగిలిపోతాయి. ఆయన విలనిజం చూపితే భయంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 'ఊరికి మొనగాడు' నుంచి 'ఆ ఒక్కటి అడక్కు' వరకు తన నటనా కౌశలంతో తెలుగు ప్రజానీకాన్ని ఉర్రూతలూగించిన రావు గోపాలరావు వర్ధంతి నేడు. తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ దగ్గరలోని గంగనపల్లిలో జన్మించిన రావు గోపాలరావు, దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. తన అద్బుత నటనతో అందరి మనస్సులో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రావు గోపాలరావు సినిమాలు చూస్తూనే వున్నాను. సాధారణంగా ఆయన పేరు చెప్పగానే అందరూ ముత్యాలముగ్గు గురించి మాట్లాడతారు. కానీ నాకు మాత్రం మల్లెపువ్వు సినిమాలో నటన ఇష్టం. ఇప్పటికీ ఆ సినిమా 22 సార్లు చూసాను. శోభన్ బాబు నటన, కధ, కధనం, పాటలు... వీటన్నిటితో పాటు రావు గోపాలరావు నటన అమితంగా నచ్చటమే అందుకు కారణం. ఇంటిగుట్టులో పాత్ర కూడా మనసుకు హత్తుకుంటుంది. అంత ఉదాత్తమైన పాత్రలో గుండెను తాకేలా ఆయన ప్రదర్శించిన నటన కంటతడి పెట్టిస్తుంది. దేవాలయం, బొబ్బిలి పులి, దొంగ మొగుడు, చాలెంజ్, గ్యాంగ్ లీడర్ తదితర చిత్రాల్లో విలన్ రావు గోపాలరావుని, ఘరానా మొగుడు, అల్లరి అల్లుడు, ఆ ఒక్కటి అడక్కు తదితర చిత్రాల్లోని సాత్వికుడైన రావు గోపాలరావుని మరచిపోవటం అంత తేలిక కాదు. అందుకేగా చనిపోయి పదహారేళ్ళు అవుతున్న ఇప్పటికీ ఆయనను మన మనసుల్లో సజీవంగా నిలుపుకుని కొనియాడుతున్నాం!
మన అభిమాన నట రారాజు ఆత్మకు శాంతి కలగాలని మనసారా ప్రార్ధిద్దాం!
Friday, July 23, 2010
పాలబుగ్గలపై కన్నీటి చారికలా?
మొన్న పేపర్ చదువుతుంటే ఒక వార్త... పన్నెండేళ్ళ బాలికపై అత్యాచారం.
నిన్న మరో వార్త... ప్రేమించలేదంటూ పద్నాలుగేళ్ళ బాలికపై యాసిడ్ దాడి.
ఇవాళ ఇంకో వార్త... తుపాకీతో బెదిరించి మైనారిటీ తీరని పిల్లలపై అత్యాచారం చేస్తున్న స్కూల్ కరస్పాండెంట్.
ఏమిటిదంతా?
పై వార్తలు చదివినప్పుడు నా మనసులో ఉత్పన్నమైన ప్రశ్న.
ఆడదాని దౌర్భల్యం. స్త్రీజాతి దురదృష్టం. మహిళల నిస్సహాయత.
నాకు నేను చెప్పుకున్న సమాధానం.
చిన్ననాటి నుండీ వింటున్న ఒక రొటీన్ సమాధానం.
ఏమిటీ దౌర్భాగ్యం?
ఆడదాన్ని చూడగానే తప్పుడు ఆలోచనలే ఎందుకు కలుగుతున్నాయీ మగాళ్ళకి?
చిన్న పెద్ద తేడా కూడా చూడకుండా కామంతో మూసుకుపోయిన చూపులు వెంటాడుతుంటే ఎలా బతుకుతుంది ఆడది ఈ మగాళ్ళ లోకంలో?
ఇంటర్వ్యూకి సిటీకి వచ్చిన ఒక వివాహితను, ఆటో డ్రైవర్ తన స్నేహితులతో కలిసి రేప్ చేసాడు.
చుట్టపు చూపు చూడటానికి వచ్చి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆరేళ్ళ చిన్ని పాపపై పశువులా పడ్డాడో ముదుసలి.
పొరపాటున తన బావతో హోటల్ గదిలో దొరికినందుకు, సెల్ ఫోనులో ఫోటోలు తీసి, వాటి ద్వారా బెదిరించి ఒక అమ్మాయిపై నాలుగు నెలలపాటు అత్యాచారం జరిపారు పోలీసులు.
ఎన్ని అకృత్యాలు? ఎన్ని దుర్మార్గాలు? ఎన్నెన్ని దారుణాలు?
టెన్నిస్ నేర్చుకోడానికి వెళ్ళిన రుచిక పరిస్తితి ఏమయ్యింది?
ఐజీ పదవిలో వున్న రాక్షసుడు పద్నాలుగేళ్ళ ఆ పాపపై అక్రుత్యానికి ఒడిగట్టాడు. న్యాయం కోసం పోరాడీ పోరాడీ అలసిపోయిన ఆ పసి మనసు ముక్కలైపోయింది. మలినమైన తనువుతో బతకలేక మరణంతో తన కధకు ముగింపు పలికింది.
చదువుకోవాలనే ఆశతో హాస్టల్లో చేరిన ఆయేషాకు జరిగిన అన్యాయం తెలియనిదెవరికి?
మృగంలా ఒక మగాడు ఆమె తనువును చీల్చేస్తుంటే, ఆ చిట్టితల్లి పెట్టిన కేకలు ఏ గాలిలో కలిసిపోయాయో?
ప్రత్యూష చావు వెనుక వున్న రహస్యాలను బయటపెట్టేది ఎవరు?
పల్లెల్లో.. పట్టణాల్లో.. మహిళలపై ఇలాంటి అత్యాచారాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
అంతమైపోయిన ఆ జీవితాలను చూసి ఈ లోకం ఒక చిన్న కన్నీటి బొట్టు విడుస్తుంది.
రాలిపోయిన ఆ లేలేత కుసుమాల కోసం ఒక నిమిషం మౌనం పాటిస్తోంది.
ఆ తరువాత వాళ్ళ కధలు కాగితాల్లో మిగిలిపోతాయి.
వాళ్లకు జరిగిన అన్యాయం కాలగర్భంలో కలిసిపోతుంది.
ఇంతేనా?
నెలల పిల్లల్ని సైతం ఎవరి చేతుల్లోనూ పెట్టలేని భయం ఎందుకు మనకి?
పిల్లల్ని స్కూలుకి పంపి, వాళ్ళు తిరిగి వచ్చేవరకూ ప్రశాంతంగా ఉండలేని దౌర్భాగ్యం ఏమిటి మనకి?
ఆడపిల్లని కనటమే పాపమా?
అలాగే వుంది పరిస్తితి.
ఆడపిల్లని పెంచటం, పెళ్లి చేయటం కాదు, వాళ్ళని కామాంధుల కళ్ళల్లో పడకుండా కాపాడుకోవటమే కష్టమైన పని నేటి తల్లిదండ్రులకి.
ఇలాగైతే ఆడపిల్లలకి రక్షణ కలిగేదేప్పుడు?
ఈ సమాజంలో వాళ్ళు ధైర్యంగా తిరిగేదేప్పుడు?
అత్యాచారాలు, లైంగిక వేధింపుల పట్ల మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తాయి గాని కాలగమనంలో వారి ఆందోళనలు మరుగునపడిపోతున్నాయి. ఒక కేసులో తీర్పు వచ్చేలోపు మరో కేసు. ఆ కేసును పరిసీలించేలోపు మరోటి. సంఘటనలు జరగటమే తప్ప సమస్యకు అంతం కనిపించటం లేదు. ఏళ్ళ తరబడి కేసులు వాయిదాలు.. యీలోపు సాక్షులను, సాక్ష్యాధారాలను తారుమారు చేయటం.. కేసును తమకు అనుకూలంగా మలచుకోవడం.. పైకోర్టుకు అప్పీలు.. తర్వాత కేసు మాఫీ…
ఇంతకు మించి జరిగేదేమిటి?
వున్న దరిద్రం చాలక అత్యాచారం జరగడానికి స్త్రీ కూడా కారణమని వాదిస్తున్నారు కొందరు ప్రబుద్దులు. స్త్రీలు శరీర భాగాలు కనపడేలా దుస్తులు ధరిస్తే మగాడు ఊరుకుంటాడా? ఆ మధ్య ఒక మగ మహారాజు వేసిన ప్రశ్న ఇది.
అందరు ఆడవాళ్ళు అమాయకులు, మగాళ్ళంతా దుర్మార్గులు అని నేను వాదించను. అందరు ఆడవాళ్ళూ అమాయకులు కాకపోవచ్చు. అందరు మగాళ్ళూ కీచకులు కాకపోవచ్చు. కానీ సమాజంలో జురుగుతున్న దారుణాలను చూసిన తరువాత ఆడదానికి మగాడి నుంచి ఎదురవుతున్న సమస్యలు చూసిన తరువాత ఇలా మాట్లాడాల్సి వస్తోంది. ఆడదానికి అన్యాయం చేస్తున్న మగాళ్ళ గురించే మనం మాట్లాడాలి.
ఆడది సరైన బట్టలు వేసుకోకపోవటం వల్ల మగాడికి కోరిక పుడుతోందా? ఎంత నీచమైన వాదన ఇది! నెలల పసికందులపై, పదేళ్లలోపు పిల్లలపై కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. మరి వాళ్ళు కూడా ఈ కోవలోకే వస్తారా? పొట్టి దుస్తులు మాత్రమే కాదు, చీర కట్టుకున్న ఆడది కూడా బలవుతోంది. దానికేమంటారో సదరు పెద్దమనిషి!
రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ దుస్తితికి బాధపడకుండా, ఇలాంటి అర్ధం పర్దం లేని కామెంట్లు చేసేవాళ్ళకు వేయాలి ముందు శిక్ష.
మనిషిలో పెరిగిపోతున్న పశు ప్రవ్రుత్తి, మంటగలిసిపోతున్న మానవీయ విలువలు ఈ దారుణాలకు కారణమని తెలిసి కూడా ఆడదానిపై నిందలు మోపి, తమ రాక్షసత్వాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్న మగ మహారాజులకు నాదో మనవి.
దయ చేసి మీ రాక్షస క్రీడకు పాలబుగ్గల పసివాళ్ళను బలి చేయకండి.
మానవత్వాన్ని మర్చిపోయి లేలేత కుసుమాలను నిర్దాక్షిణ్యంగా నలిపి పారేయకండి.
అంకుల్, అన్నయ్యా, సార్ అంటూ అమాయకంగా పిలిచే ఆ చిట్టి తల్లుల్లకు చితి పేర్చకండి.
పరాయివాళ్ళ పిల్లల పట్ల అలాంటి ఆలోచన కలిగితే... మీ కడుపున పుట్టిన బిడ్డను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.
మహానుభావులు కానక్కర్లేదు, కనీసం మనుషుల్లా ప్రవర్తించండి.

Thursday, July 8, 2010
మనసున్న మారాజు
జనుల మనసెరిగిన రాజు
మమతకు అర్ధం చెప్పిన మనసున్న మారాజు
ప్రజల శ్రేయస్సే పరమావధిగా పాలించిన రారాజు
ప్రతిఫలమాశించక ప్రేమను పంచిన మహారాజు
ఆయన లేకున్నా అయన జ్ఞాపకాలు మనలను విడిచిపోవు.
అయన వెళ్ళిపోయినా ఆయన పంచిన వెలుగులో బతుకుతున్న జీవితాలు ఆయనను మరచిపోవు.
మదిమదిలో కొలువైన మహా మనీషికి వందనం
మరువలేని, మరపురాని మహానుభావునికి అభివందనం
Monday, June 28, 2010
Saturday, June 26, 2010
కేక పెట్టించే కేకులు!
కేకు పేరు చెబితే లోట్టలేయని వారుండరు. కానీ ఈ కేకులను చూస్తే మాత్రం కేక పెట్టకుండా వుండరు. ఒక వంటగాడు తన సృజనాత్మకతను ఇలా ప్రదర్శించి చూపాడు. క్రియేటివిటీ సంగతేమో కానీ... వీటిని చూసాక పిల్లలు కేకు పేరు చెబితేనే జడుసుకోవటం ఖాయం. కావాలంటే మీరూ చూడండి!
Thursday, June 24, 2010
విలన్ ఏమంటున్నాడు?
నటీనటులు: విక్రమ్, ఐశ్వర్యారాయ్, పృథ్విరాజ్, కార్తీక్, ప్రభు, ప్రియమణి తదితరులు.
కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: మణిరత్నం, శారద త్రిలోక్
సంగీతం: రెహమాన్
మాటలు: శ్రీరామకృష్ణ
పాటలు: వేటూరి
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్, మణికండన్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్: సమీర్ చంద్ర
మణిరత్నం సినిమా అనగానే ఆత్రుతగా ఎదురుచూసే ప్రేక్షకుల ఆశలపై నీళ్ళు చల్లేసింది రావన్ సినిమా. అద్భుతమైన నటనా పటిమను ప్రదర్శించే విక్రమ్, అందాలరాశి ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్, నంబర్ వన్ దర్శకుడు మణిరత్నం, సంగీత సామ్రాట్ రెహ్మాన్... ఇవేవీ రావణుడి వోటమిని ఆపలేకపోయాయి. తెలుగులో విలన్ గా విడుదలైన ఈ చిత్రం అభిమానుల తిరస్కారానికి గురయ్యింది. క్లారిటీ లేని కధనం, కధకు ఏమాత్రం బలం చేకూర్చలేకపోయిన మాటలు, ఎంతమాత్రం ఇంపుగా లేని సంగీతం... అన్నీ కలిసి సినిమాని చతికిలబదేలా చేసాయి.
అటవీ ప్రాంతాల్లో ఉండే సంఘ విద్రోహ శక్తి వీర (విక్రమ్). ఆ అటవీ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతుంటాడు. పోలీసులను సజీవ దహనం చేయడం, ఎదురు తిరిగితే ఉప్పు పాతరెయ్యడం వంటివి చేస్తుంటాడు. (ఈ పాత్ర కాస్త వీరప్పన్ ను తలపోస్తుంది.) ఆ ప్రాంతానికి వచ్చిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవ్ (పృథ్విరాజ్) వీరను చంపడమే లక్ష్యం గా పెట్టుకుంటాడు. పోలీస్‌ల కారణంగా వీర చెల్లెలి (ప్రియమణి) జీవితం నాశనం అవుతుంది. ఆ పగతో రగిలిపోతున్న వీర... దానికి ప్రతిగా దేవ్ భార్య రాగిణి (ఐశ్వర్య)ని కిడ్నాప్ చేసి తన స్థావరానికి తీసుకొస్తాడు. 14 రోజులు రాగిణిని బంధించి పోలీసులతో యుద్ధానికి దిగుతాడు. తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ.
రామాయణాన్ని ఆధునకరీస్తూ రావణుడిని హైలెట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రంలో పాత్రల గాఢత అంతగా కనపడదు. దానికి కారణం పాత్రలను వాటి వాటి నేఫద్యాల్లో ఎస్టాబ్లిష్ చేయకపోవటమే. ఇంటర్వెల్ అయ్యేదాకా విక్రమ్ అస్సలు ఐశ్వర్య రాయ్ ని ఎందుకు కిడ్నాప్ చేసాడు...ఆమె ద్వారా అతను ఏం సాధిద్దామనుకున్నాడు...అతను ఏం నష్టపోయాడు..ఏం లాభం పొందుదామనుకున్నాడనేది స్పష్టం కాదు. సినిమాలో ఎంటర్టైనర్మెంట్ పూర్తిగా లోపించింది. పాత్రల్లో ఎమోషన్ శృతి మించింది. నటీనటుల నటనాకౌశలం చూపడం కోసమే సినిమా తీసినట్టుంది. సంభాషణలు చాలా చాలా పేలవంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్: వీరయ్య పాత్రలో విక్రమ్ అద్భుతంగా రాణించాడు. అతని హావబావాలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఐశ్వర్యారాయ్ తన పాత్రకు నూరు శాతం న్యాయం చేసింది. కాస్త డీ గ్లామరైజ్డ్ గా వున్న ఎంతో అందంగా కనిపించింది. ఆమె అందం చిత్రానికి నిండుదన్నాన్నించింది. ప్రభు, కార్తీక్ కీలకమైన పాత్రల్లో బాగా చేశారు. ప్రియమణి కూడా తన వంతు మెప్పించింది. పృథ్విరాజ్ కూడా పరవాలేదనిపించాడు. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ప్రాణం. అడవుల చిత్రీకరణ అద్భుతంగా వుంది. పచ్చని ప్రకృతిని తెచ్చి స్క్రీన్ మీద పరిచినట్టుగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో రీ రికార్డింగ్ కూడా చాలా బాగుంది.
మైనస్ పాయింట్స్: సినిమాకి అతి పెద్ద మైనస్ డైలాగ్స్. నటీనటుల పెదవుల కదలికకు, సంభాషణలకు సంబంధం వుండదు. దానితో అసలు ఏమి మాట్లాడుకుంటున్నారో అర్ధం కానీ పరిస్తితి. ఇది చాలా విసుగు తెప్పిస్తుంది. ఎక్కడా పంచ్ డైలాగులు కానీ, ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగించే మాటలు కానీ లేవు. ఏదో మాట్లాడుతున్నారులే అనుకోవాలి. పాటలు కూడా వినసొంపుగా లేవు. రెహ్మాన్ సంగీతం సినిమాకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. మొత్తంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా బోర్. హీరోయిన్ తప్పించుకోవలనుకోవటం, విలన్ కి దొరికిపోవటం తప్ప ఏమి కధ వుండదు. సెకెండ్ హాఫ్ కాస్త పరవాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ప్రేక్షకుడిని మళ్ళీ మళ్ళీ థియేటర్ కి రాప్పించనూ లేదు.
Subscribe to:
Posts (Atom)